Tuesday, 4 August 2020

Yenthasakkagunnave song Lyrics Rangasthalam

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ
ఎంత సక్కగున్నవే
ముత్తైదు వామెల్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవే
సుక్కల చీర కట్టుకున్న వెన్నెలలాగ ఎంత సక్కగున్నవే

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే

ఓ రెండు కాల్ల సినుకువి నువ్వు
గుండె సెర్లొ దూకేసినావు
అలల మూట విప్పేసినావు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
మబ్బులేని మెరుపువి నువ్వు
నేల మీదనడిసేసినావు
నన్ను నింగిసేసేసినావు ఎంత సక్కగున్నవే 
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సెరుకు ముక్క నువ్వు కొరికి తింట ఉంటె ఎంత సక్కగున్నవే
సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే
తిరనాల్లొ తప్పి ఏడ్చె బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే
గాలి పల్లకీలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే

కడవ నువ్వు నడుమున బెట్టి
కట్ట మీదనడిసొత్తా ఉంటే
సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
కట్టెల మోపు తలకెత్తుకోనీ
అడుగులోన అడుగేస్తా ఉంటే
అడవి నీకు గొడుగెట్టినట్టు ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
బురద చేలో వరి నాటు ఎత్తా ఉంటె ఎంత సక్కగున్నవే
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవే

ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె
ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే
సింతసెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె
చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే
లచ్చిమి ఎంత సక్కగున్నవే

Movie    :  Rangasthalam
Lyrics    :  Chandrabose
Music    :  Devi Sri Prasad
Singer   :  Devi Sri Prasad
Cast     :  Ram Charan, Samantha

No comments:

Post a Comment

All Lyrics titles