Tuesday, 4 August 2020

Manasaa manasaa Song Lyrics BACHELOR 2020

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో ‘మనసా మనసా’ అనే పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటను మార్చి 2న విడుదల చేశారు. ఈ సినిమా నుంచి వస్తోన్న తొలిపాట కావడంతో బజ్ ఏర్పడింది. అయితే, ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించడంతో ఆ బజ్ మరింత పెరిగిపోయింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను తన స్టైల్లోనే అద్భుతంగా ఆలపించారు. సురేంద్ర కృష్ణ రచించిన ఈ పాట సాహిత్యాన్ని మేం ఇక్కడ అందిస్తున్నాం. మీరూ పాడేయండి..

ప‌ల్లవి
మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 1
ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా..

చ‌ర‌ణం - 2

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..

No comments:

Post a Comment

All Lyrics titles