దున్నపోతుల బెరే చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరే చూడు
కమలపూడి
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ
కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క
చక్కని చుక్కా దక్కే చూడూ మామా
చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
చిత్ర కన్ను కొంటేవాడా
మేడలోనీ కుర్రదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
మేడలోనీ కుర్రదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి
నిన్ను కోరి వన్నెలాడీ లైలా
కొట దాటీ పేటా చేరే
కురస కురస అడివిలోనా పిలగా
కురిసెనే గాంధారీ వానా
కురస కురస అడివిలోనా పిలగా
కురిసెనే గాంధారీ వానా
ఎక్కరానీ ఎక్కరానీ కొండలెక్కీ మావ
ప్రేమలోనా చిక్కీనావూ
ఎక్కరానీ కొండలెక్కీ మావ
ప్రేమలోనా చిక్కీనావూ
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా
ఊరు వాడా తోడు రాగా
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా
ఊరు వాడా తోడు రాగా
జంటగానే జంటగానే కూడినారూ మామ
చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారూ మామ
చలువ పందిరి నీడ కిందా
Movie : Krishnarjuna Yuddham
Lyrics : Penchal Das
Music : Hiphop Taizha
Singer : Penchal Das
Cast : Nani, Anupama Parameswaran, Rukshar Mir
No comments:
Post a Comment