అడిగి అడగకుండా వచ్చేశావే
నా మనసులోకీ హో అందంగా దూకి
దూరం దూరంగుంటూ ఏం చేశావే
దారం కట్టి గుండె ఎగరేశావే
ఓ చూపుతోటి హో ఓ నవ్వు తోటి
తొలిసారిగా నాలోపల
ఏమైయ్యిందో తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో
ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువు నా కంట పడకుండా నా వెంట పడకుండా
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తున్నానులే
ఒకటో ఎక్కమ్ కూడా మరచి పోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో...
Movie : Chalo
Lyrics : Bhaskarabhatla
Music : Mahati Swara Sagar
Singer : Anurag Kulakarni
No comments:
Post a Comment