Tuesday, 4 August 2020

Trend marina Friend Marade song Lyrics vunnadhi okkate Jindhagi

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నోటుబుక్ నుండి ఫేసుబుక్ కి మారిన
ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా
కాలింగ్ మారినా .....
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా
ఫీలింగ్ మారునా ...
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే

పుల్ల ఐస్ నుండి క్రీం స్టోన్ కి మారినా
రెండిటిలో చిన్నదనం ఫ్రెండ్ షిప్పే
ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారినా
మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్ షిప్పే
టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా
పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్ షిప్పే
పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్ షిప్పే
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే

పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్టు ఫ్రెండ్ షిప్పే
ఫ్రూటీ ల నుండి బీరులోకి మారిన
పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్ షిప్పే
మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా
నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్ షిప్పే
అన్నీ ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్ షిప్పే
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే

Movie    :  Vunnadi Okate Zindagi
Lyrics    :  Chandrabose
Music    :  Devi Sri Prasad
Singer   :  Devi Sri Prasad
Cast     :  Ram, Anupama, Lavanya

No comments:

Post a Comment

All Lyrics titles