Tuesday, 4 August 2020

Mela mellaga Song Lyrics venkatdri Express


మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా
పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా..
పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ.. పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా


Movie    :  Venkatadri Express
Lyrics    :  Kasarla Shyam
Music    :  Ramana Gogula
Singers  :  Shwetha Mohan, Anjana Sowmya
Cast     :  Sandeep Kishan, Rakul Preet Singh

No comments:

Post a Comment

All Lyrics titles