Wednesday, 5 August 2020

మనసు మారే’ పాట లిరిక్స్: సరళమైన సిరివెన్నెల సాహిత్యం.. మీరూ పాడేయండి

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఆరాధన భావం మనలో కలుగుతుంది. ముఖ్యంగా సంగీత ప్రియులైతే సిరివెన్నెల గారి పేరు వింటేనే పులకించిపోతారు. అంతలా ఆయన తన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మూడు దశాబ్దాలకు పైగా తన కలం నుంచి మధుర గేయాలను జాలువారుస్తోన్న సిరివెన్నెల.. ఇప్పటికీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య ‘సామజవరగమన’, ‘నువ్వు నాతో ఏమన్నావో’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌కి సాహిత్యం అందించిన సిరివెన్నెల ఇప్పుడు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తోన్న ‘V’ సినిమా కోసం ఒక మంచి పాట రాశారు.

‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే’ అంటూ సాగే ఈ పాటలోనూ శాస్త్రిగారు తన మార్కు సాహిత్యం చూపించారు. అమిత్ త్రివేది స్వరపరిచిన ఈ పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటను అమిత్ త్రివేది, శాషా తిరుపతి, యాజిన్ నిజార్ ఆలపించారు. సాహిత్యం ఎంత బాగుందో.. అమిత్ త్రివేది ఇచ్చిన ట్యూన్‌ కూడా అంతే బాగుంది. అమిత్ త్రివేది, శాషా అద్భుతంగా ఆలపించారు. మరి ఆ పాటను మీరూ పాడేయండి..

పల్లవి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్‌ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళీ వినాలి కౌగిలి

చరణం - 1
అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూల నావ గాలి తోవ హైలోహైలెసో

చేరనీవా చేయనీవా సేవలేవేవో ॥మనసు మరీ॥

చరణం - 2
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నె పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో ॥మనసు మరీ॥

No comments:

Post a Comment

All Lyrics titles